
K-RAMP : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న 11వ చిత్రం “K-ర్యాంప్” షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా హాస్య మూవీస్ మరియు రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రాజేష్ దండ, శివ బొమ్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తుండగా, యుక్తి తరేజా కథానాయికగా నటిస్తోంది. ఇటీవల పూర్తయిన కేరళ షెడ్యూల్‌లో ఆకర్షణీయ లొకేషన్లలో చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
ప్రస్తుతం షూటింగ్ తుది దశలో సాగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత, ఈ దీపావళికి “K-ర్యాంప్” గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కోసం రెడీ అవుతోంది. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజాతో పాటు నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్, ఎమోషన్, వినోదంతో కూడిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నట్లు సమాచారం.












