Little Hearts OTT Release : ఓటీటీలోకి ‘లిటిల్ హార్ట్స్’.. విత్ ఎక్స్‌టెండెడ్ కట్స్

Littlehearts
Little Hearts OTT Release : ఎలాంటి అంచనాలు లేకుండా, చిన్న సినిమాగా వ‌చ్చి టాలీవుడ్‌లో సూప‌ర్ హిట్ అందుకున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ ఇప్పుడు ఓటీటీ వేదికకు రాబోతోంది. యూట్యూబర్ మౌళి తనుజ్, శివానీ నాగారం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం సాయి మార్తండ్ దర్శకత్వంలో, ఆదిత్య హాసన్ నిర్మాణంలో రూపొందింది. రాజీవ్ కనకాల, అనితా చౌదరి, సత్య కృష్ణన్ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో నటించారు. కేవలం రూ. 2.5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా థియేటర్లలో దాదాపు రూ. 33 కోట్ల వసూళ్లను సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

తాజాగా, మేకర్స్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్ లో ‘లిటిల్ హార్ట్స్’ అక్టోబర్ 1 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ‘ది బ్లాక్ బస్టర్ రామ్ కామ్ ఆఫ్ ది ఇయర్ కమింగ్ టు యువర్ హోమ్’ అంటూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ స్ట్రీమింగ్ వెర్షన్‌లో అదనపు సీన్స్‌తో కూడిన ఎక్స్‌టెండెడ్ కట్స్ యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. దీంతో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించనుంది యూత్ ఎంటర్‌టైనర్.