Hi Nanna : తండ్రి, కూతుళ్ళ ప్రేమే ‘గాజు బొమ్మ..’ సాంగ్


నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘హాయ్ నాన్నా’. మృణాల్ ఠాకూర్ కథానాయకిగా నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ‘సమయమా.. ‘ పాట చార్ట్ బస్టర్ గా నిలవగా, తాజాగా మేకర్స్ ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ ‘గాజు బొమ్మ’ ని సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా లాంచ్ చేసారు.

Also Read :  Janhvi Kapoor: బుచ్చిబాబు ‘రౌడీ’ డైరెక్టర్.. చరణ్ ఒక ‘జెమ్’.. జాన్వీ కపూర్ క్యూట్ స్పీచ్!

ఓ తండ్రికి తన కూతురుపై ఉన్న ప్రేమను అక్షరాల్లో పేర్చి దానిని పాటగా మారిస్తే ఎలా ఉంటుందో ‘గాజు బొమ్మ’ పాట కూడా అలాగే చాలా అద్భుతంగా వుంది. హేశం అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో నానికి కూతురిగా బేబీ కియారా ఖన్నా నటిస్తుంది. హాయ్ నాన్నా చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Also Read :  Buchi Babu: 'పెద్ది' హీరోయిన్ పాత్రపై ట్రోల్స్.. దర్శకుడు బుచ్చిబాబు ఎమోషనల్ కామెంట్స్!