
Singa Title Glimpse: మ్యాచో స్టార్ గోపీచంద్ నేడు (జూన్ 12) తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ స్పెషల్ డే రోజున అభిమానులకు బ్యాక్ – టు – బ్యాక్ సర్ప్రైజ్‌లు ఇస్తూ గోపీచంద్ మస్త్ ఖుషీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన నటిస్తున్న ‘భరతవర్ష’ మూవీ నుంచి అదిరిపోయే బర్త్ డే పోస్టర్ రిలీజ్ కాగా.. తాజాగా అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న గోపీచంద్ 34వ చిత్రానికి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ ఈ సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పడుతుండగా.. ఈ చిత్రానికి ‘సింగ’ (SINGA) అనే పవర్‌ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టైటిల్‌కు తగ్గట్టే రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో గోపీచంద్ కంప్లీట్ రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తూ ఊరమాస్ వైబ్స్ తెచ్చారు. ఈ విజువల్స్ చూస్తుంటే గోపీచంద్ మార్క్ హై-వోల్టేజ్ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోందని అర్థం అవుతుంది.
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన యంగ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అనార్కలి నాజర్ హీరోయిన్‌గా నటిస్తోంది. టాలెంటెడ్ కంపోజర్ సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ’70ఎమ్ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై ప్రొడ్యూసర్స్ విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా ‘భరతవర్ష’తో పాటు ‘సింగ’ టైటిల్ గ్లింప్స్ కూడా రావడంతో గోపీచంద్ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
