Mahakali : ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్‌ నుంచి మరో విజువల్ వండర్ – ‘మహాకాళి’ ఫస్ట్ లుక్ రిలీజ్!

Mahakali
Mahakali : ‘హనుమాన్’ సినిమాతో సూపర్ హీరో జానర్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లిన విజనరీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ఈసారి RKD స్టూడియోస్‌తో కలిసి మరో అద్భుతమైన కాన్సెప్ట్‌తో ముందుకొస్తున్నారు. వారి తాజా చిత్రం ‘మహాకాళి’ నుంచి లీడ్ ఫేస్‌ను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో భూమి శెట్టి ఆగ్రహం, శక్తి, ఆధ్యాత్మికత కలగలిపిన ఇంటెన్స్ లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. డార్క్ టోన్‌లో రూపుదిద్దుకున్న పోస్టర్‌కి అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

సినిమా ఇప్పటికే 50 శాతం షూట్ పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లో భారీగా నిర్మించిన సెట్స్‌పై ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. సాధారణంగా నాన్-స్టార్ సినిమాలకు ఇంత పెద్ద బడ్జెట్ వెచ్చించడం అరుదు అయినా, ‘మహాకాళి’ టీమ్ మాత్రం ఆ సాహసాన్ని చేసి చూపింది. పలువురు ప్రముఖ నటీమణులు ఈ పాత్రకు ఆసక్తి చూపినప్పటికీ, కథ సారాన్ని నిజంగా ప్రతిబింబించగల కొత్త ముఖం కావాలనే ఉద్దేశంతో భూమి శెట్టిని ఎంపిక చేశారు. ఆమె వ్యక్తిత్వం, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాత్రకు సరిగ్గా సరిపోయాయి.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

“From the Universe of HanuMan” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్‌లో మరో అద్భుత అధ్యాయం కానుంది. ఆర్ఎకే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ అందించగా, పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. పవర్, ప్యాషన్, ఆధ్యాత్మికతతో నిండిన ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని టీమ్ చెబుతోంది. ఫస్ట్ లుక్ విడుదలతోనే ‘మహాకాళి’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.