
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ హైదరాబాద్‌లో వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. తాజాగా నాని ఇంట్రడక్షన్ సాంగ్ ‘ఆయా షేర్’ చిత్రీకరణ ప్రారంభమైంది. భారీ సెట్‌పై వందలాది డ్యాన్సర్లతో తెరకెక్కిస్తున్న ఈ పాటకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మాస్ బీట్‌లతో నిండిన పవర్‌ఫుల్ ట్యూన్ అందించాడు. నాని రా, రగ్గడ్ డ్యాన్స్ స్టైల్‌కు ఈ పాట అద్దం పట్టనుంది.
విజయ్ నటించిన జన నాయగన్ సినిమాకు పనిచేసిన సుధన్ మాస్టర్ ఈ పాటకు అద్భుతమైన కొరియోగ్రఫీ అందిస్తున్నారు. నాని ఎనర్జీ, మ్యాడ్ మూవ్‌మెంట్స్ ఈ పాటను సినిమాకే హైలైట్‌గా నిలపనున్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రతి అంశంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటూ ‘ది ప్యారడైజ్’ను గ్రాండ్‌గా మలుస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఛాయాగ్రహణం చి సాయి, ఎడిటింగ్ నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైన్ అవినాష్ కొల్ల నేతృత్వంలో సాగుతున్న ఈ చిత్రం ఎనిమిది భాషల్లో పాన్-వరల్డ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.












