The Paradise : ఇంట్రడక్షన్ సాంగ్ ‘ఆయా షేర్’తో దుమ్ము లేపనున్న నాని

The Paradise
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ హైదరాబాద్‌లో వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. తాజాగా నాని ఇంట్రడక్షన్ సాంగ్ ‘ఆయా షేర్’ చిత్రీకరణ ప్రారంభమైంది. భారీ సెట్‌పై వందలాది డ్యాన్సర్లతో తెరకెక్కిస్తున్న ఈ పాటకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మాస్ బీట్‌లతో నిండిన పవర్‌ఫుల్ ట్యూన్ అందించాడు. నాని రా, రగ్గడ్ డ్యాన్స్ స్టైల్‌కు ఈ పాట అద్దం పట్టనుంది.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్

విజయ్ నటించిన జన నాయగన్ సినిమాకు పనిచేసిన సుధన్ మాస్టర్ ఈ పాటకు అద్భుతమైన కొరియోగ్రఫీ అందిస్తున్నారు. నాని ఎనర్జీ, మ్యాడ్ మూవ్‌మెంట్స్ ఈ పాటను సినిమాకే హైలైట్‌గా నిలపనున్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రతి అంశంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటూ ‘ది ప్యారడైజ్’ను గ్రాండ్‌గా మలుస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఛాయాగ్రహణం చి సాయి, ఎడిటింగ్ నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైన్ అవినాష్ కొల్ల నేతృత్వంలో సాగుతున్న ఈ చిత్రం ఎనిమిది భాషల్లో పాన్-వరల్డ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.