
HIT 3 : నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన హిట్-3 మే 1న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా, హిట్ సిరీస్‌లో మూడో భాగంగా వచ్చింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం, నానికి నిర్మాతగా కూడా మరో హిట్‌ను అందించింది. సినిమా విడుదలైన మొదటి రోజే రూ.43 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించగా, రెండో రోజు కూడా అదే ఊపు కొనసాగించి రెండు రోజుల్లో మొత్తం రూ.62 కోట్లు కలెక్ట్ చేసింది. నాని ఇప్పటి వరకు క్లాస్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించగా, ఈసారి పూర్తిగా వైలెన్స్‌తో నిండిన మాస్ పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో మంచి స్పందన లభించింది. ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ కొనసాగుతున్నాయి, పైగా ఇతర పెద్ద సినిమాలు లేవు, ‘రెట్రో’ కి నెగెటివ్ టాక్ రావడం వంటి అంశాలన్నీ హిట్-3కు కలిసొచ్చాయి. వీకెండ్‌లో ఈ చిత్రం వసూళ్లు మరింతగా పెరిగే అవకాశముంది. మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటున్న హిట్-3, నానికి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.












