Nani32 : సుజీత్ తో నాని నెక్స్ట్ మూవీ.. కానీ పవర్ తర్వాతే లవర్ !


నేచురల్ స్టార్ నాని బర్త్​డే సందర్భంగా ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ అయితే లభించింది. నాని, వివేక్ ఆత్రేయ‌ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ చేస్తున్నారు. ఈరోజు నాని బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఇప్పుడు నాని కొత్త సినిమా గురించి అప్డేట్ వచ్చింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ లో #Nani32 వస్తున్నట్లు అనౌన్స్ చేసారు. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించనున్నారు.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

అంతేకాదు మేకర్స్​ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఒక హింసాత్మక వ్యక్తి అహింసాత్మకంగా మారినప్పుడు, అతని జీవితం తలక్రిందులుగా ఎలా మారుతుందనేది స్టోరీ లైన్ అని చూపించారు. ఈ సినిమా 2025లో రానుందని తెలిపారు. ఇక “ఇది సుజీత్ సినిమా. పవర్ తర్వాత.. లవర్ వస్తాడు” అంటూ నాని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇకపోతే ప్రస్తుతం సుజీత్ పవన్ కళ్యాణ్ తో OG సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాతే Nani32 సెట్స్ మీదకు వెళ్లే అవకాశం వుంది.