‘వార్ 2‌’ తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్


టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన లాస్ట్ సినిమా ఆర్ ఆర్ ఆర్ గ్లోబల్ హిట్ తో తాను గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ రేంజ్ ఏ లెవెల్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక దీని తర్వాత ఎన్టీఅర్ ప్రస్తుతం కొరటాల శివ సినిమా చేస్తున్నాడు. 30 వ సినిమా గా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఏడాది రాబోతుంది. ఇకపోతే ఈరోజు ఎన్టీఆర్ నుంచి అసలు ఊహించని రేంజ్ సెన్సేషనల్ అప్డేట్ బయటకి వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ వారి స్పై యూనివర్స్ లో భాగంగా వస్తున్న ‘వార్ 2‌’ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇది ‘వార్’ సినిమాకి సీక్వెల్.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

అంతేకాదు బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో ఎన్టీఆర్-హ్రితిక్ రోషన్ కలిసి కనిపించబోతున్నారని అనలిస్ట్ తరన్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఇక ఎన్టీఆర్-హ్రితిక్ కలిసి కనిపిస్తే అది విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. ఈ వార్త బయటకి రాగానే ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.