NTR30 ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్..!


ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం NTR30. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలకి ముహూర్తం ఖరారు చేసారు చిత్రబృందం.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

పక్కా యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ కి డేట్ ఫిక్స్ చేసారు. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 19న ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటే టైటిల్ ని కూడా రివీల్ చేస్తారా లేదా చూడాలి మరి. ఇకపోతే అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2024, ఏప్రిల్ 5న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది.