Om Bheem Bush Teaser : ఫన్ రైడ్ లా ‘ఓం భీమ్ బుష్’ టీజర్..


బ్యాంగ్ బ్రదర్స్ శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ‘ఓం భీమ్ బుష్’ అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ ప్రీ-లుక్ గ్లింప్స్ , ఫస్ట్-లుక్ పోస్టర్‌తో నవ్వులు పూయించారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది. ఇప్పుడు బ్యాంగ్ బ్రదర్స్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్ ని ప్రజెంట్ చేస్తూ టీజర్ గ్రాండ్ గా లాంచ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఆస్ట్రోనాట్స్ స్పేస్ సూట్ లో పాల్గొనడం అందరినీ విశేషంగా అలరించింది.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

ముగ్గురు శాస్త్రవేత్తలు ఒక యాడ్ స్కిప్ చేసి, క్లిష్టమైన స్థితిలో ఉన్న రోగిని పట్టించుకోకుండా యూట్యూబ్‌లో వీడియో చూడటానికి వేచి ఉండటంతో టీజర్ హిలేరియస్ గా ప్రారంభమవుతుంది. వారు తమ స్థావరాన్ని నగరం నుండి ఓ గ్రామానికి మార్చారు, అక్కడ వారు A నుండి Z సొల్యూషన్‌లను ప్రారంభిస్తారు. అయితే, వారికి గ్రామంలోని నిధిని కనుగొనే మరో ఎజెండా ఉంది. ఈ క్రమంలో గ్రామంలో బ్లాక్ మ్యాజిక్ జరుగుతున్నట్లు గమనిస్తారు. గ్రామస్థులతో సంభాషణలు అద్భుతమైన వినోదాన్ని అందించాయి. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ అద్భుతమైన కామిక్ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చరవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘ఓం భీమ్ బుష్’ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం