OG Trailer : ‘ఓజి’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్!!

Og
OG Trailer : సెప్టెంబర్ నెల టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి కిక్కు తెచ్చింది. ‘కొత్తలోక’, ‘లిటిల్ హార్ట్స్’, ‘మిరాయ్’, ‘కిష్కింధపురి’ వంటి సినిమాలు ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షించాయి. అదే ఉత్సాహంలో ఈ నెల 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘OG’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో మెప్పించనున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా, DVV ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

ఇప్పటికే చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్లు, పాటలు అభిమానుల్లో ఉత్సాహం నింపాయి. మూడు సాంగ్స్‌కు వచ్చిన స్పందనతో పాటు పవన్ కళ్యాణ్ లుక్‌లు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. తాజాగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. ‘ఓజి’ ట్రైలర్ ను ఈ నెల 21న రిలీజ్ కాబోతుందని ప్రకటించడంతో అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.