
First Time : హేమంత్ ఇప్పనపల్లి కథ రాసుకుని తానే దర్శక నిర్మాతగా రూపొందిస్తున్న “ఫస్ట్ టైం” సినిమా ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కుతున్నప్పటికీ, టెక్నికల్‌గా మరియు విజువల్స్ పరంగా ఎక్కడా తగ్గకుండా గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ముఖ్యంగా, AI ఉపయోగించకుండా పూర్తిగా HI( హ్యూమన్ ఇంటలిజెన్స్) తో హై రేంజ్ గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని నిర్మించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అంతేకాదు భారతదేశంలో ప్రతిష్టాత్మక వీఎఫ్‌ఎక్స్ చిత్రంగా దీన్ని తీర్చిదిద్దాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
కాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈనెల 28న “మంగళవారం” అగ్ర నటి చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. ఈ ప్రకటనతోనే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విజువల్స్ మరియు టెక్నికల్ స్టాండర్డ్స్ విషయంలో రాజీ పడకుండా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమాలో “మంగళవారం” అగ్ర నటి పాయల్ బాయ్ ఫ్రెండ్ సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతుండగా, ‘బిగ్ బాస్’ ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్‌గా నటిస్తున్నారు. అనిక్క విక్రమన్ హీరోయిన్‌గా కనిపించనుంది. మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని శ్రీ వెంకట్, సూరజ్ ఎస్ కురుప్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని వేణు మురళీధర్ మరియు రామ్ నిర్వహిస్తున్నారు.









