
ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్లుగా, డైలాగ్ కింగ్ సాయికుమార్ మరియు సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం “సుయోధన”. వై.ఎస్. మాధవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ అధికారిక రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ, మంచి కథా కధనాలతో అత్యుత్తమ నిర్మాణ ప్రమాణాలతో “సుయోధన” చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. ప్రియదర్శి, సాయికుమార్, ద్రిషిక చందర్, సీనియర్ హీరోయిన్ ప్రేమ తమ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారని అన్నారు. జై క్రిష్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, ప్రముఖ గేయరచయిత రామజోగయ్య శాస్త్రి పాటలకు సాహిత్యం అందించారు.
అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని నిర్మాత తెలిపారు. త్వరలోనే ఈ సినిమా టీజర్, ట్రైలర్ మరియు పాటలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా విడుదల చేయనున్నారు.
నటీనటులు:
ప్రియదర్శి, ద్రిషిక చందర్, సాయి కుమార్, ప్రేమ, విష్ణు (లడ్డు), దేవి ప్రసాద్, రాజశ్రీ నాయర్ తదితరులు.
