మార్చి 27 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయిన ‘సుయోధన’

Suyodhana priyadarshi
ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్లుగా, డైలాగ్ కింగ్ సాయికుమార్ మరియు సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం “సుయోధన”. వై.ఎస్. మాధవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ అధికారిక రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు.

Also Read :  జగపతి బాబు 'వదలా' ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్...

ఈ సందర్భంగా నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ, మంచి కథా కధనాలతో అత్యుత్తమ నిర్మాణ ప్రమాణాలతో “సుయోధన” చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. ప్రియదర్శి, సాయికుమార్, ద్రిషిక చందర్, సీనియర్ హీరోయిన్ ప్రేమ తమ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారని అన్నారు. జై క్రిష్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, ప్రముఖ గేయరచయిత రామజోగయ్య శాస్త్రి పాటలకు సాహిత్యం అందించారు.

Also Read :  ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న   తెలుగు–తమిళ  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’...

అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని నిర్మాత తెలిపారు. త్వరలోనే ఈ సినిమా టీజర్, ట్రైలర్ మరియు పాటలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా విడుదల చేయనున్నారు.

నటీనటులు:
ప్రియదర్శి, ద్రిషిక చందర్, సాయి కుమార్, ప్రేమ, విష్ణు (లడ్డు), దేవి ప్రసాద్, రాజశ్రీ నాయర్ తదితరులు.