‘ప్రాజెక్ట్ కె’ ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ డిలీట్.. అందుకేనా ?


సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులని మరోసారి ఆకట్టుకుంది వైజయంతీ మూవీస్. ఈ చిత్ర భారీ తారాగణంలో కమల్ హాసన్ చేరికతో సంచలనం సృష్టించింది. తర్వాత శాన్ డియాగో కామిక్-కాన్‌లో పాల్గొనే మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. తాజాగా విడుదలైన దీపికా పదుకొణె ఇంటెన్స్ ఫస్ట్ లుక్ అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఇకపోతే తాజాగా ఈ చిత్రం నుంచి ప్రభాస్ మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ లుక్‌ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ దారుణమైన ట్రోలింగ్ కి గురైంది. ఈ పోస్టర్ లో ప్రభాస్ ఐరన్ మాన్ పోజులో కనిపిస్తున్నట్లుంటాడు. అంతేకాదు తలని తీసుకొచ్చి వేరే బాడీ కి అతికించినట్లుగా ఈ అవుట్ లుక్ కనిపిస్తోంది. ఇకపోతే ఇదేదో ఫ్యాన్ మేడ్ పోస్టర్ లాగా అనిపించిందని కొందరు నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేశారు. దీంతో అధికారికంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌ని సోషల్ మీడియా ఖాతాల నుంచి మేకర్స్ డిలీట్ చేశారు.అయితే డిలీట్ చేసిన ఫస్ట్ లుక్ బదులు ఎలాంటి గ్రాఫిక్స్, పేర్లు లేకుండా ఉన్న అదే పోస్టర్‌ని కొంచెం చేంజ్ చేసి పోస్ట్ చేశారు.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

ఇకపోతే మరోపక్క ‘ప్రాజెక్ట్ K’ శాన్ డియాగో కామిక్-కాన్‌ లోని ప్రతిష్టాత్మకమైన హెచ్ హాల్‌లో లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ మహత్తరమైన ఈవెంట్‌లో ఈ సినిమా టైటిల్, టీజర్‌ను రివిల్ చేసే మరపురాని ప్రయాణం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ‘ప్రాజెక్ట్ K’లో ఇండస్ట్రీ లోని బిగ్గెస్ట్ స్టార్స్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ నటిస్తున్నారు.