Site icon TeluguMirchi.com

SlumDog Teaser: యాక్షన్ అండ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ టీజర్!

Puri Jagannadh

SlumDog Teaser: టాలీవుడ్‌లో ఎందరో హీరోలకు తిరుగులేని మాస్ ఇమేజ్‌ను అందించిన డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈ కమర్షియల్ మేకర్.. ఈసారి తన మార్క్ స్ట్రాంగ్ కంటెంట్‌తో కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. పూరీ జగన్నాథ్ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్న సరికొత్త రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ (SlumDog – 33 Temple Road). పూరీ కనెక్ట్స్ – జె.బి మోషన్ పిక్చర్స్ పతాకాలపై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, జె.బి నారాయణరావు కొండ్రొల్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ చిత్రం నుంచి తాజాగా అఫీషియల్ టీజర్‌ను రిలీజ్ చేశారు.

ఈ చిత్రంలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, సీనియర్ నటి టబు, సంయుక్త, దునియా విజయ్ కుమార్, జరీనా వహాబ్, వి.టి.వి గణేష్, బ్రహ్మాజీ వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ ఆద్యంతం పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్, హై-వోల్టేజ్ ఫైట్స్, పూరీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో నిండిపోయింది. ముఖ్యంగా.. “ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కునే జీవితాలు మావి.. అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నిన్ను ఎందుకు వదులుతాం” అంటూ సాగే భావోద్వేగభరితమైన డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైన తీరు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ప్రతి ఒక్క పాత్రను చాలా ఇంటెన్సివ్‌గా, రా అండ్ రస్టిక్ స్టైల్‌లో మేకర్స్ ప్రెజెంట్ చేశారు. ఈ సినిమాతో పూరీ జగన్నాథ్ గట్టి కంబ్యాక్ ఇవ్వడం ఖాయమని, ఈసారి ఆయన ఖాతాలో పక్కా బ్లాక్‌బస్టర్ పడుతుందని పూరీ అభిమానులు – సినిమా ప్రేమికులు సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version