Rakul Preet Singh : పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్


స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ ఈరోజు (ఫిబ్రవరి 21) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి గోవాలో ఇరు కుటుంబ సభ్యులకు సంబంధించిన రెండు సంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read :  Buchi Babu: 'పెద్ది సెట్స్‌లో అప్పుడు కాళ్లు , చేతులు ఆడలేదు': బుచ్చిబాబు

ఈ వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులతో పాటు కొద్ది మంది సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని కొత్త జంటను ఆశీర్వదించారు. ముఖ్యంగా శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా, ఆయుష్మాన్ ఖురానా ఆయన భార్య తాహిరా కశ్యప్, అర్జున్ కపూర్, లవ్ రంజన్, డేవిడ్ ధావన్, వరుణ్ ధావన్ ఆయన భార్య నటాషా దలాల్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, షాహిద్ కపూర్, సోనమ్ కపూర్ వంటి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.

Also Read :  Peddi: మిక్సిడ్ టాక్‌ను తలకిందులు చేస్తూ రూ. 250 కోట్ల దిశగా 'పెద్ది'!