మెగా ప్రిన్సెస్ పేరులో అంత అర్ధం ఉందా ?


రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు జూన్ 20న పాప పుట్టిన సంగ‌తి తెలిసిందే. దాంతో తమ ఇంటికి మ‌హాల‌క్ష్మి వచ్చిందని మెగాఫ్యామిలీ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక ఈరోజు జరిగిన బారసాల కార్యక్రమంలో మెగా ప్రిన్సెస్ కు నామకరణం కూడా చేసారు. ఇంతకీ పాపకు ఏ పేరు పెట్టారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో, మెగాస్టార్ చిరంజీవి దీనికి సంబంధించిన వివరాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

రామ్ చరణ్ – ఉపాసన దంపతుల కుమార్తెకు క్లీంకార (KLIN KAARA) అనే పేరు పెట్టినట్లు చిరంజీవి వెల్లడించారు. లలితా సహస్ర నామం నుంచి ఈ పేరు తీసుకున్నట్లు తెలిపారు. మానవుడిలో ఆధ్యాత్మికతను మేల్కొలిపే స్వచ్ఛమైన శక్తి పరివర్తనను క్లీంకార అనే పేరు సూచిస్తుందని తెలిపారు. ఈ పేరులోని లక్షణాలను తమ చిన్నారి ఎదిగేకొద్దీ తన వ్యక్తిత్వంలో కచ్చితంగా ప్రతిబింబిస్తుందని నమ్ముతున్నామని పేర్కొన్నారు.