రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ, ఆమెతో కలిసి నటించాలనుందట …


హాలీవుడ్‌లో RRR క్రేజ్ మొదలైనప్పటి నుంచీ ఒకటే టాక్. త్వరలోనే రాజమౌళి, తారక్, చరణ్‌లు హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దర్శకుడు రాజమౌళిని కామెరూన్, స్పిల్‌బర్గ్ లాంటి దిగ్గజాలు ప్రశంసించడంతో.. జక్కన్న క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పలు నిర్మాణ సంస్థలూ.. రాజమౌళిని సంప్రదించాయి. నేరుగా హాలీవుడ్ సినిమా కాకుండా.. అక్కడి కొలాబరేషన్‌తో త్వరలోనే ఓ మూవీ చేయబోతున్నట్టు, ఇప్పటికే చర్చలు కూడా జరిగినట్టు.. రాజమౌళినే స్వయంగా ప్రకటించారు.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న చరణ్.. ప్రముఖ షో ‘టాక్‌ ఈజీ’లో మాట్లాడారు. తన హాలీవుడ్ సినిమా గురించి హింట్ ఇచ్చారు. ‘టర్మినేటర్‌’, ‘గ్లాడియేటర్‌’, ‘బ్రేవ్‌హార్ట్‌’ తరహా హాలీవుడ్‌ చిత్రాలంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు రామ్‌చరణ్. అలాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌లో చేయాలని తనకూ ఉందని అన్నారు. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి. కొన్ని నెలల్లో నా హాలీవుడ్‌ ఎంట్రీకి సంబంధించిన వార్త వస్తుంది.. అంటూ సంచలన విషయం చెప్పారు రామ్ చరణ్. ఇక జులియా రాబర్ట్స్‌ ఆయన ఫేవరెట్‌ నటి అట. అతిథి పాత్రలోనైనా ఆమెతో కలిసి ఓ సినిమాలో నటించాలని ఉందని అన్నారు చరణ్.