రానా నాయుడు సీజన్ 2 వచ్చేస్తోంది..


టాలీవుడ్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేష్, రానా కలిసి నటించిన తోలి వెబ్ సిరీస్ రానా నాయుడు. అమెరిక‌న్ హిట్ సిరీస్ రే డోనోవ్యాన్‌కు అడాప్షన్‌గా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్‌ తెలుగు, త‌మిళంతోపాటు వివిధ భాషల్లో విడుదలైంది. గత నెలలో విడుదలైన ఈ వెబ్ సిరీస్ వీక్షకుల నుండి మిశ్రమ స్పందనలను అందుకుంది. అయితే ఇప్పుడు రానా నాయుడు ఇక సీజన్‌ 2తో కూడా సందడి చేయబోతుంది.

Also Read :  Peddi Day 1 Collection: బాక్సాఫీస్ దగ్గర 'పెద్ది' శివతాండవం.. జూన్ 4న 'పెద్ది' బుకింగ్స్ రికార్డ్స్ ఇవే!

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్, త్వరలోనే రానా నాయుడు 2 రాబోతుంది అంటూ ఓ గ్లింప్స్ వీడియో విడుదల చేసింది. ‘మీరేమి చింతించకండి.. మీ బాధనంతనంటినీ పోగొట్టడానికి నాయుడులు మళ్లీ తిరిగి వస్తున్నారు’ అంటూ ఓ నోట్ ను కూడా రాసుకొచ్చారు. దీంతో రానా నాయుడు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సిరీస్‌లో సుచిత్రా పిళ్లై, గౌరవ్ చోప్రా మరియు సుర్వీన్ చావ్లా ముఖ్యమైన పాత్రలు పోషించారు.

Also Read :  Abhisun Jeevinth: డైరెక్టర్‌గా హిట్టు.. హీరోగా సక్సెస్ .. ఇప్పుడు 'డ్రామా కంపెనీ'తో హ్యాట్రిక్‌పై కన్నేసిన అభిషన్ జీవింత్!