
Ranabaali Release Date: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ‘శ్యామ్ సింగ రాయ్’ ఫేమ్ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. 2026 అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ‘రణబాలి’ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
“మన చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయం ఈ అక్టోబర్‌లో తెరుచుకోబోతోంది” అంటూ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో అసలు ‘రణబాలి’ కథ ఏంటి? చరిత్రలోని ఎలాంటి ఘటనను దర్శకుడు తెరపైకి తీసుకురాబోతున్నారు? అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నతో పాటు హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాహుల్ సంకృత్యన్ గత చిత్రాలకు భిన్నంగా భారీ కాన్వాస్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అజయ్ – అతుల్ సంగీతం అందిస్తుండగా, నీరవ్ షా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల కోసం అంతర్జాతీయ స్టంట్ నిపుణులు యానిక్ బెన్, ఆండీ లాంగ్ న్గుయెన్ పనిచేస్తున్నారు. దీంతో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ‘రణబాలి’ 2026 అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.














