Ranabali: ‘రణబాలి’లో వారిద్దరినీ ఎంపిక చేయడానికి కారణం అదే: డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్‌

Ranabali

Ranabali: టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘రణబాలి’. బ్రిటిష్‌ పాలనా కాలం నాటి ఒక జంట ప్రేమ ప్రయాణం నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘టాక్సీవాలా’ వంటి సూపర్‌హిట్ తర్వాత రౌడీ హీరో – డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్‌ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్‌ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలతో పాటు, హీరో హీరోయిన్ల ఎంపిక వెనుక ఉన్న అసలు కారణాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఈ కథ 1870ల కాలంలో సాగుతుంది. ఇందులో హీరో పాత్రకు గుర్రపుస్వారీపై మంచి పట్టుండాలి, శారీరకంగా చాలా ఫిట్‌గా కనిపించాలి. విజయ్ మల్టీటాలెంటెడ్‌ యాక్టర్. పైగా ఆయన ఇప్పటివరకు ఇలాంటి పల్లెటూరి నేపథ్యం ఉన్న తిరుగుబాటు యోధుడి పాత్రలో నటించలేదు. నేను రాసుకున్న కథకు, ఆ క్యారెక్టర్‌కు విజయ్ వందకు వంద శాతం సరిపోతాడనే నమ్మకంతోనే ఆయన్ని ఎంపిక చేశా.” అని అన్నారు. అలాగే ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక ‘జయమ్మ’ అనే కీలక పాత్రలో నటిస్తోంది. ఈ పాత్ర కోసం ఎందరో హీరోయిన్లను ఆడిషన్ చేసినట్లు చెప్పిన దర్శకుడు, రష్మికను ఫైనల్ చేయడానికి గల కారణాన్ని వివరించారు.

Also Read :  ఆ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కార్తీ.. #Karthi31 క్రేజీ అప్‌డేట్!

ఈ కథను దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేర్చాలనే ఉద్దేశంతో, జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నటి కోసం వెతికాను. రష్మికకు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఈ పాత్రకు ప్లస్ అవుతుందని భావించాను అని చెప్పారు. రియల్ లైఫ్‌లో భార్యాభర్తలైన విజయ్‌ – రష్మికల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఈ సినిమాలో అద్భుతంగా కుదిరిందని, వీరిద్దరూ ‘సూపర్ జోడీ’ అని డైరెక్టర్ ప్రశంసించారు. ఈ సినిమా 1854 నుంచి 1878 మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న పీరియాడిక్ లవ్ స్టోరీ. పాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కుతున్న ‘రణబాలి’ చిత్రం సెప్టెంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.