
Ranbir Kapoor: బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమాపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడిగా స్టార్ హీరో యష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో రణ్‌బీర్ కపూర్ యస్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యష్ పోషిస్తున్న రావణుడి పాత్ర గురించి ఆయన మాట్లాడుతూ.. “ఈ పాత్రకు కావాల్సిన ఆరా, స్టార్‌డమ్, స్క్రీన్ ప్రెజెన్స్ యష్‌లో పుష్కలంగా ఉన్నాయి. రావణుడి పాత్రకు ఆయన పూర్తిగా న్యాయం చేశారు” అని ప్రశంసించారు. అంతేకాకుండా, యష్ తన నటనతో రావణుడి పాత్రకు కొత్త రూపాన్ని తీసుకొచ్చారని, ఆయనలో కనిపించే స్వాగ్, నిజాయితీ, కరిజ్మా ఈ పాత్రను ఇప్పటివరకు ప్రేక్షకులు చూసిన రావణుడి పాత్రలన్నింటికంటే భిన్నంగా నిలబెడతాయని ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు తెరపై కనిపించిన రావణుడి పాత్రలతో పోలిస్తే, ఈ సినిమాలో యష్ ప్రెజెంటేషన్ పూర్తిగా కొత్తగా ఉంటుందని రణ్‌బీర్ వెల్లడించారు. ప్రేక్షకులు ఈ పాత్రను చూసి తప్పకుండా ఆశ్చర్యపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, సినిమా క్లైమాక్స్‌లో అత్యంత కీలకంగా నిలిచే రామ–రావణుల మధ్య ప్రధాన పోరాట సన్నివేశాలు ఇంకా చిత్రీకరించాల్సి ఉందని రణ్‌బీర్ తెలిపారు. ఆ సన్నివేశాలు ఈ సినిమాలో హైలైట్స్‌లో ఒకటిగా నిలుస్తాయని చెప్పారు. ఇప్పటికే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. రణ్‌బీర్ కపూర్, యష్ వంటి స్టార్‌ల కాంబినేషన్‌తో పాటు, సీతగా సాయి పల్లవి, హనుమాన్ గా సన్నీ డియోల్ కనిపించనున్నారు. పురాణ ఇతిహాసాన్ని ఆధునిక సాంకేతికతతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం ప్రత్యేకంగా కృషి చేస్తుండటంతో ఈ సినిమాపై సినీ అభిమానుల్లో రోజు రోజుకు ఆసక్తి పెరుగుతోంది.
