‘రావణాసుర’ ట్రైలర్ టాక్..


ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ భారీ విజయాలను అందుకున్న మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ రావణాసుర. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై అభిషేక్‌ నామా నిర్మించిన ఈ సినిమాని యువ దర్శకుడు సుధీర్‌ వర్మ తెరకెకెక్కించారు. ఇక దక్ష నాగర్కర్‌, మేఘ ఆకాష్‌, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మానుయేల్‌ హీరోయిన్స్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నుండి తాజాగా ట్రైలర్‌ విడుదల చేశారు.

Also Read :  Buchi Babu: 'పెద్ది' హీరోయిన్ పాత్రపై ట్రోల్స్.. దర్శకుడు బుచ్చిబాబు ఎమోషనల్ కామెంట్స్!

యాక్షన్‌, థ్రిల్లింగ్‌ అంశాలతో ప్రస్తుతం విడుదలైన ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా డైలాగ్స్.. ‘మర్డర్ చేయడం క్రైమ్.. దొరక్కుండా మర్డర్ చేయడం ఆర్ట్’, ‘ఈ భూమ్మీద నన్ను ఆపగలిగేవాడు ఎవరైనా ఉన్నారంటే అది నేనే..’ అని రవితేజ చెప్పే డైలాగ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇకపోతే ‘వాడు క్రిమినల్ కాదు.. లా చదివిన క్రిమినల్’ అంటూ ఈ మూవీలో రవితేజ క్యారెక్టర్ గురించి విలన్ చెప్పకనే చెబుతాడు. ఇక ఏప్రిల్‌ 7న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది.

Also Read :  Chiranjeevi: ‘పెద్ది’ బ్లాక్‌బస్టర్ విజయంపై మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్.. ఒక తండ్రిగా, నటుడిగా గర్వపడుతున్నానంటూ కామెంట్స్!