
Ravi Teja SVC64: ‘ఇరుముడి’తో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న మాస్ మహారాజా రవితేజ.. తన తదుపరి సినిమాను అధికారికంగా ప్రకటించారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రవితేజ 64వ చిత్రం (#SVC64) తెరకెక్కనుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. పక్కా కమర్షియల్ అంశాలతో పాటు ఫ్రెష్ ట్రీట్మెంట్తో ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేలా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. సినిమా అనౌన్స్‌మెంట్‌తో పాటు విడుదల చేసిన ‘దాగుడు మూతలు దండాకోర్.. ఎంటర్టైన్మెంట్ హార్డ్ కోర్’ అనే క్యాచీ ట్యాగ్‌లైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ట్యాగ్‌లైన్‌ను బట్టి చూస్తే రవితేజ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీకి కూడా సినిమాలో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రవితేజ వింటేజ్ కామెడీ టైమింగ్‌ను మరోసారి తెరపై చూడొచ్చనే అంచనాలు అభిమానుల్లో మొదలయ్యాయి.
ఈ చిత్రాన్ని 2027 జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. దీంతో వచ్చే సంక్రాంతి బరిలో రవితేజ సినిమా కూడా చేరింది. ఇటీవల ‘ఇరుముడి’తో ప్రేక్షకులను అలరించిన ఆయన.. వెంటనే దిల్ రాజు, హసిత్ గోలి కాంబినేషన్లో ప్రాజెక్ట్ ఓకే చేయడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఇక ఈ సినిమాకు హీరోయిన్, సంగీత దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. మరోవైపు ఈ చిత్రానికి ‘వీరాధివీరులంట’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.














