Ravi Teja: బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టిన మాస్ మహారాజా..

Mass Maharaja

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ వరుస క్రేజీ ప్రాజెక్టులతో టాలీవుడ్‌లో ఫుల్ బిజీ కానున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కించేందుకు లైన్ క్లియర్ చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్లతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను స్టార్ట్ చేసేందుకు రవితేజ షెడ్యూల్స్ లాక్ చేసినట్లు సమాచారం. గతంలో రవితేజతో ‘రాజా ది గ్రేట్’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో ఆయన మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. దీనికి ‘రాజా రాజ చోర’, ‘స్వాగ్’ చిత్రాల ఫేమ్ హసిత్ గోలి దర్శకత్వం వహించనున్నారట. అన్ని అనుకున్నట్లుగా జరిగితే, ఈ క్రేజీ కాంబినేషన్ ఆగస్ట్ నెల నుంచి రెగ్యులర్‌ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం.

Also Read :  Varanasi: మహేష్ - రాజమౌళి ‘వారణాసి’ రైట్స్ కోసం ‘జీ’ సంస్థ భారీ డీల్?

దీనితో పాటే మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌ను కూడా రవితేజ లైన్లో పెట్టారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘సరిపోదా శనివారం’ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ సినిమా అక్టోబర్ నుంచి సెట్స్‌పైకి వెళ్లనుందని చెబుతున్నారు. వివేక్ ఆత్రేయ మార్క్ సరికొత్త జోనర్‌లో ఈ స్క్రిప్ట్ ఉండబోతోందని, రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యేలా కథను ఆయన సిద్ధం చేశారని తెలుస్తోంది. కేవలం రెండు నెలల గ్యాప్‌లోనే టాలీవుడ్ టాప్ బ్యానర్లలో మాస్ మహారాజా సినిమాలు స్టార్ట్ కానుండటంతో రవితేజ అభిమానుల్లో సరికొత్త జోష్ నెలకొంది.