Eagle : సంక్రాంతి బరి నుండి తప్పుకున్న ర‌వితేజ ‘ఈగల్’..


అందరు అనుకున్నట్లుగానే జనవరి 13న రిలీజ్ అవ్వాల్సిన ర‌వితేజ ‘ఈగ‌ల్’ మూవీ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. ఈరోజు సంక్రాంతికి రిలీజ్ కాబోయే సినిమాల గురించి సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ‘ఈగల్’ సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకుంటున్నట్లు దిల్ రాజు తెలిపారు. అయితే ఓ సినిమా మూడు వారాలు వెనక్కు వెళ్లడం అంటే.. ఆర్థికంగా చాలా భారం పడుతుంది.. ఇది చాలా పెద్ద త్యాగం అన్నారు. ‘ఈగల్’ సినిమా వెనక్కి వెళ్లేందుకు అంగీకరించిన నిర్మాతకు, రవితేజకు ధన్యవాదాలు తెలిపారు.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

కాగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, కావ్య థాప‌ర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. న‌వ‌దీప్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఇకపోతే ‘ఈగల్’ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ కానుందని సమాచారం. అదే కనుక జరిగితే ‘టిల్లు స్క్వేర్’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వెనక్కి వెళ్లే అవకాశం ఉంది.