Jigris Teaser Launch : జిగ్రీస్ సినిమాకు బిగ్ సపోర్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా

Jigris teaser
సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఘనంగా జరిగిన జిగ్రీస్ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీజర్‌ను విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ, “ప్రొడ్యూసర్ కృష్ణ వోడపల్లి నాకు LKG నాటి స్నేహితుడు. సాధారణంగా చెప్పితే సినిమా ప్రొడ్యూస్ చెయ్యమని నేను అంటాను, కానీ ఈసారి చెప్పకుండా స్టార్ట్ పెట్టాడు. Animal షూట్‌లో ఉండగా ఫోన్ చేసి, గోవాలో ఒక షెడ్యూల్ అయిపోయింది అన్నాడు. నేను తిట్టినా, తర్వాత హైదరాబాద్‌కి వచ్చినప్పుడు కొన్ని విజువల్స్ చూపించాడు. అవి బాగా నచ్చాయి. ఈరోజుల్లో ఉండే బూతు జోకులు లేకుండా, డైరెక్టర్ హరీష్ చాలా బాగా కామెడీ రాశాడు, తీశాడు” అని అన్నారు.

అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కమ్రాన్ సయ్యద్ ఇచ్చిన సంగీతం చాలా బాగుందని, విజువల్స్‌కి బాగా సరిపోయిందని చెప్పారు. మూడు నాలుగు పాటలు త్వరలో రిలీజ్ అవుతాయని, ఆ పాటలు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. టీజర్‌లో చూపినదానికంటే సినిమాలో కామెడీ ఇంకా ఎక్కువగా ఉంటుందని అన్నారు. “మన తెలుగు ప్రేక్షకులు సినిమా బాగుంటే ఎవరిదైనా బ్లాక్‌బస్టర్ చేస్తారు. ఈ చిన్న సినిమాను తప్పక సపోర్ట్ చేయండి. వీళ్ళు మామూలు కష్టపడలేదు, వేరే రకంగా రిస్క్ తీసుకున్నారు. గోవాలో షూట్ చేస్తుంటే, మహారాష్ట్ర బోర్డర్‌లో షూట్ చేస్తుంటే పోలీసుల చేత పట్టుబడ్డారు. రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత ఆ కథలు బయటకు వస్తాయి” అని చెప్పారు.

Also Read :  YouTuber Anvesh : అన్వేష్‌కు బిగుస్తున్న ఉచ్చు… లుకౌట్ నోటీసుల తర్వాత డిజిటల్ బ్యాన్?

ఇంకా, కో ప్రొడ్యూసర్ వినయ్ కూడా కొత్తవాడే అని, సినిమా రిలీజ్ అయ్యాక అందరూ తమ “జిగ్రీస్”తో కలిసి చూసేయాలని సూచించారు. ఈ చిత్రంలో కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించిన ఈ సినిమాను మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు క్రాంతి మాధవ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..

డైరెక్టర్ : హరీష్ రెడ్డి ఉప్పుల
ప్రొడ్యూసర్: కృష్ణ వోడపల్లి
డిఓపి: ఈశ్వర్ ఆదిత్య
మ్యూజిక్ డైరెక్టర్ : కమ్రాన్ సయ్యద్
ఎడిటర్ : చాణక్య రెడ్డి తూర్పు
మ్యూజిక్ లేబుల్: టి సిరీస్
డిజిటల్ మార్కెటింగ్ : బిగ్ ఫిష్ మీడియా