Hot Photoshoot : సోషల్ మీడియాలో హీటెక్కించిన అందం!

Sharadda

 

Hot Photoshoot : బోల్డ్ అండ్ బ్యూటిఫుల్… ఈ రెండు పదాలు ఈ మధ్య శ్రద్ధా దాస్‌ను చూస్తే కచ్చితంగా గుర్తొస్తాయి. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నలుపు రంగు శాటిన్ డ్రెస్‌లో ఆమె తన అందాన్ని మరింత హైలైట్ చేస్తూ నిలిచింది.

హాల్టర్ నెక్ డిజైన్, షార్ప్ కట్‌ఔట్స్ ఉన్న ఈ డ్రెస్ ఆమె స్టైలిష్ సైడ్‌ను బయటపెట్టింది. అంతేకాదు, డ్రెస్ కంటే ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిందేమిటంటే… ఆమె చూపు. ఒకసారి నేరుగా కెమెరాలోకి చూస్తూ, మరోసారి నెమ్మదిగా పక్కకు చూసేలా ఉన్న పిక్చర్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి.

తన జుట్టును చాలా నేచురల్‌గా వదిలేయడం, మేకప్‌ కూడా మినిమల్‌గా ఉండటంతో ఫోటోషూట్‌కు క్లాస్ టచ్ వచ్చింది. మెరుస్తున్న అద్దాలు, మెట్లకింద డార్క్ లొకేషన్లు వంటి బ్యాక్‌డ్రాప్స్‌లో తీయడం కూడా ఈ ఫోటోలకి స్పెషల్ ఫీల్ ఇచ్చింది.

ప్రస్తుతం శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రలో నటించిన “అర్థం” మూవీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ షూట్ ఆమె కొత్త సినిమా ప్రమోషన్‌లో భాగమే అయినా, దీని వెనుక ఉన్న సైలెంట్ కాన్ఫిడెన్స్ మాత్రం గమనించకుండా ఉండలేం. ఈ ఫోటోలతో మళ్లీ ఒకసారి శ్రద్ధా దాస్ తన స్టైల్, హుందాతనం ఎలా బ్యాలెన్స్ చేయాలో చూపించింది.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Das (@shraddhadas43)