Valentine’s Day : వాలెంటైన్స్ డే స్పెషల్.. ‘సీతా రామం’ తో పాటు ఆ మూవీస్ రీ రిలీజ్


ఎందరో ప్రేమికులు ఈరోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఈరోజును ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఒకరికొకరు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలి, ఎలా సర్ప్రైజ్ చేయాలి ఇలా ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంటారు. ఇంతకీ ఆరోజు ఏంటంటే, అదేనండి ఫిబ్రవరి 14, వాలెంటైన్స్ డే (ప్రేమికుల రోజు). అలాంటి వారి కోసమే ఈసారి వాలెంటైన్స్ డే నాడు ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ మూవీస్ థియేటర్లలో రీ రిలీజ్ కానున్నాయి.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

ఇందులో ముఖ్యంగా దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన క్లాసికల్ బ్లాక్ బస్టర్ మూవీ ‘సీతా రామం’, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘తొలిప్రేమ’, సూర్య హీరోగా నటించిన ‘సన్నాఫ్ కృష్ణన్’అలాగే సిద్ధార్థ్, షామిలి కాంబోలో వచ్చిన ‘ఓయ్’ లాంటి ప్రేమ కథ చిత్రాలు ఫిబ్రవరి 14న థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇక వీటితో పాటు బాలీవుడ్ లోనూ పలు చిత్రాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’, ‘దిల్‌తో పాగల్‌హై’, ‘మొహబ్బతే’ వంటి క్లాసిక్ హిట్ చిత్రాలు రానున్నాయని సమాచారం. మరి ఈసారి వాలెంటైన్స్ డే ప్రేమికులతో పాటు, సినీ ప్రియులకు కూడా పండగే అనమాట.