Jatadhara : ‘జటాధర’ హైప్ పీక్స్‌లో – సుధీర్ బాబు సాలిడ్ కంబ్యాక్‌తో రెడీ!

Jatadhara
Jatadhara : నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరు‍ణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ చిత్రంలో శిల్పా శిరోధ్కర్ కీలక పాత్ర పోషించారు. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో నవ దళపతి సుధీర్ బాబు మాట్లాడుతూ.. “ఈరోజు కొన్నినిజాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సుధీర్ బాబు అంటే ఎవరు? ఈ ప్రశ్న నన్ను నేను చాలాసార్లు అడిగాను. కృష్ణ గారి అల్లుడు, మహేష్ బాబు గారి బావ. ఇది నేను గర్వంగా ప్రేమగా ఒప్పుకుంటున్నాను. నేను యాక్టర్ అవ్వాలనుకున్న మూమెంట్ తలచుకుంటే భయమేస్తుంది. యాక్టర్ అవ్వాలని కోరికనే పర్మినెంట్గా చంపేయాలనుకున్నాను. ఎందుకంటే కోరిక ఎంత బలంగా ఉందో రెస్పాన్సిబిలిటీ కూడా అంతే ఉంది. యాక్టర్ గా సక్సెస్ అవుతానా? ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చేస్తారా? ఇలా చాలా భయాలు ఉండేవి. కాకపోతే నేను మొండి వాడిని. ఒక స్పోర్ట్స్ పర్సన్ ని. మా ఇంట్లో అమ్మానాన్న ప్రయత్నించడమే నేర్పించారు. ఆగిపోవడం ఎప్పుడూ నేర్పించలేదు. కృష్ణ గారి అల్లుడు, మహేష్ గారి బావగానే ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఎంతోమంది నిర్మాతలను కలిసాను. అడిషన్స్ ఇచ్చాను. యాక్షన్ వీడియోలు పట్టుకుని ప్రతి ఆఫీస్ కి తిరిగాను. నాకు దొరికింది ఎక్స్ట్రా గా ఒక కాఫీ మాత్రమే. అంతకుమించి నేను ఏది కూడా అడ్వాంటేజ్ తీసుకోలేదు.

కృష్ణానగర్ కష్టాలు తెలియకపోవచ్చు, కానీ ఫిలింనగర్ బాధలు తెలుసు. తిండి లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలియదు గానీ, కళ్ళ ఎదురుగా తిండి వుండి నిరాశతో ముద్ద దిగిన ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. బస్సులో నేను ట్రావెల్ చేయకపోవచ్చు, కానీ కారులో కూర్చుని ఏడవడం తెలుసు. ఇవన్నీ నేను సింపతి కోసం చెప్పట్లేదు. అలా అయితే నా మొదటి సినిమా అప్పుడే చెప్పేవాడిని. ఇప్పుడు నాకు సింపతీ అవసరం లేదు. ప్రేమ గౌరవం చాలు. మీరందరూ మహేష్ బాబు గారిపై ప్రేమతోనే వచ్చారు. అందరికీ థాంక్యూ సో మచ్. కానీ ఇందులో ఎవరో ఒకరు ఏదో మూలన నాకోసం వచ్చి ఉంటారు. నా కోసం చప్పట్లు కొట్టి ఉంటారు. నాకు మనసుకు తెలుస్తుంది. ఎవరో ఒకరు నా కోసమైతే వచ్చారు. నేను కష్టపడతాను. కానీ ఆ ఒక్కడి కోసం ప్రాణం పెట్టేస్తాను. గెలిచే వరకు కూడా పోరాడాలి. లేదా చచ్చే వరకు పోరాడాలి. జటాధరలో డైలాగ్ ఇది. నా రియల్ లైఫ్ లో కూడా యూజ్ అవుతుంది. ఒక్క సినిమా చాలు అనుకున్న వాడిని 20 సినిమాలు చేశాను. అందులో హిట్లు ఉన్నాయి ప్లాపులు ఉన్నాయి. ఈ 20 సినిమాల్లో హిట్టుకు కారణం నా కష్టం. ఫ్లాఫ్ కి కారణం కూడా అది నా ఫెయిల్యూరే. మహేష్ గారు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా ఏ ఒక్క రోజు కూడా హెల్ప్ చేయమని అడగలేదు. ఏ ఒక్క నిర్మాతని ఒక్క రూపాయి కూడా ఎక్కువ అడగలేదు. ఏ నిర్మాతను కూడా ఒక ఫైట్ పెట్టండి, డాన్స్ పెట్టండి అని అడగలేదు. ఈ 20 సినిమాలు చేయడానికి కారణం ఒక్కటే. కృష్ణ గారి అల్లుడు, మహేష్ గారి బావ.. సుధీర్ బాబు. చాలామంది నెపోకిడ్ అని అంటున్నారు. నిజానికి అలాంటిది ఏమీ లేదు. ఇవన్నీ మనస్పూర్తిగా మీతో చెప్పాలనిపించింది.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్

‘జటాధర’ నేను చేసిన 20 సినిమాల్లో ది బెస్ట్ స్క్రిప్ట్. సినిమా చూస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి క్యారెక్టర్ ఏ హీరో చేయలేదు. ఘోస్ట్ హంటర్ క్యారెక్టర్ లో కనిపిస్తాను. కాకపోతే దెయ్యాలపై తనకి నమ్మకం ఉండదు. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ధనపిశాచి బ్యాక్గ్రౌండ్ తీసుకుని డైరెక్టర్ వెంకట్ చాలా అద్భుతంగా ఈ సినిమాను తీశారు. ఈ సినిమా దెయ్యాలు దేవుడు ఉన్నాయని నమ్మేవారికి, లేవని నమ్మేవారికి ఇద్దరికీ సమానంగా నచ్చుతుంది. ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ తో చెప్పడం జరిగింది. నవంబర్ 7న అందరు సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నిర్మాత ప్రేరణ నా దగ్గరికి వచ్చి ఈ కథ చెప్పినప్పుడు తను నా అభిమాని అని చెప్పింది. నువ్వు నాతో సినిమా చేయాలని చెప్పింది. తను చాలా సక్సెస్ఫుల్ సినిమాలు చేసింది. తను తెలుగులో సినిమా చేయడం తెలుగు సినిమాకి ఒక మంచి అడ్వాంటేజ్. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉంటాయి. డైరెక్టర్ వెంకట్ అభిషేక్ ఈ స్క్రిప్ట్ ని చాలా అద్భుతంగా తీశారు. సమీర్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. రాజీవ్ ఈ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా కోసం శివతాండవం చేయడం అద్భుతమైన అనుభూతి. ఇదంతా ఆ శివుని దీవెనలుగా భావిస్తున్నాను. సందీప్ చాలా అద్భుతమైన కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమాలో ఒక 15 నిమిషాల సీక్వెన్స్ ఉంటుంది. అందరికీ గుజ్బంస్ తెప్పిస్తుంది. సోనాక్షి చాలా పవర్ ఫుల్ రోల్ చేశారు. ఈ సినిమాల్లో పని చేసిన ప్రతి టెక్నీషియన్, నటీనటులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నవంబర్ 7న అందరూ రెడీ అయిపోండి. ఫ్యామిలీ డ్రామా, శివతాండవం.. ఇలా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. కార్తికేయలో కృష్ణుని గురించి చెప్పే ఒక ఎపిసోడ్ ఉంటుంది. అలానే ఈ సినిమాలో కూడా శివుని గురించి చాలా మంచి ఎపిసోడ్స్ ఉంటాయి. అరుణాచలం వెళ్లే వాళ్ళు ఈ సినిమా ఇంకా అద్భుతంగా కనెక్ట్ అవుతారు. అందరూ నవంబర్ 7న జటాధర సినిమాకి వెళ్లాలని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్యూ”.