Site icon TeluguMirchi.com

Swayambhu Epic Teaser : బిగ్గెస్ట్ విజువల్ వండర్ గా వండర్ స్వయంభు’ టీజర్…

Swayambhu epic teaser
నిఖిల్ సిద్ధార్థ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’ టీజర్‌తో ప్రమోషన్ల వేటను మొదలుపెట్టింది. పిక్సెల్ స్టూడియోస్‌ బ్యానర్ పై అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం, క్రీస్తుశకం 985 నాటి నేపథ్యంతో సాగే ఒక విజువల్ వండర్. పరమశివుడు శ్రీరాముడికి అందించిన ‘సెంగోల్’ (ధర్మదండం) చుట్టూ తిరిగే కథాంశం, దానిని చేజిక్కించుకోవడానికి జరిగే భీకర యుద్ధాలు టీజర్‌లో అద్భుతంగా ఆవిష్కరించారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా నిఖిల్ ఒక పవర్‌ఫుల్ వారియర్ అవతార్‌లో కనిపించగా, సంయుక్త, నభా నటేష్ కీలక పాత్రల్లో మెరిశారు. హాలీవుడ్ స్థాయి విజువల్స్, రవి బస్రూర్ అందించిన హై-వోల్టేజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ పాన్-వరల్డ్ మూవీపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి.

టెక్నికల్‌గా చూస్తే, బాహుబలి ఫేమ్ కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ మరియు ఎం. ప్రభాహరణ్, రవీంద్రల ఆర్ట్ వర్క్ సినిమాకు గ్రాండియర్‌ను తీసుకొచ్చాయి. హైదరాబాద్‌లోని ప్రసాద్ PCX థియేటర్‌లో 3D ఫార్మాట్‌లో విడుదల చేసిన ఈ టీజర్ చూసిన సినీ ప్రియులు, ఇందులోని వార్ యాక్షన్ సన్నివేశాలు మరియు VFX నాణ్యతకు ఫిదా అవుతున్నారు. తెలుగుతో పాటు హిందీ, చైనీస్, స్పానిష్ వంటి అంతర్జాతీయ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. సమ్మర్ రిలీజ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘స్వయంభు’, పీరియడ్ యాక్షన్ జానర్‌లో ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించే మాగ్నమ్ ఓపస్‌గా నిలవబోతోంది.

Exit mobile version