Sharwanand: నాగబంధం డైరెక్టర్‌తో శర్వానంద్‌ భారీ మల్టీస్టారర్.. మహాభారతం ఆధారంగా కొత్త ప్రయోగం!

Sharwanand

Sharwanand: ‘నాగబంధం’ చిత్రంతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన డైరెక్టర్ అభిషేక్ నామా ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈసారి యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో ఓ భారీ మల్టీస్టారర్‌ను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం మహాభారతంలోని ఓ కీలక ఘట్టాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కనుందట. పురాణ కథను ఆధునిక టెక్నాలజీ, భారీ విజువల్స్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో చిత్రబృందం ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఇది సాధారణ పౌరాణిక చిత్రం కాకుండా, యాక్షన్, ఎమోషన్, విజువల్ గ్రాండియర్‌కు పెద్దపీట వేస్తూ పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమా మల్టీస్టారర్ కావడంతో మరో కీలక పాత్రలో ఏ స్టార్ హీరో నటిస్తారనే అంశంపై ఇప్పటికే ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. శర్వానంద్ కెరీర్‌లో ఇదొక డిఫరెంట్ ప్రాజెక్ట్‌గా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు, అభిషేక్ నామా కూడా భారీ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని టాక్. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మహాభారతం ఆధారంగా రూపొందనున్న ఈ భారీ మల్టీస్టారర్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.