Lust Stories 2 : ఎవరైనా వస్తే మధ్యలో ఆపేయాల్సిన పనిలేదు : తమన్నా


2018 లో వచ్చిన ‘లస్ట్ స్టోరీస్’ ఆంథాలజీ సిరీస్ ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ‘లస్ట్ స్టోరీస్2’ రాబోతుంది. తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన లస్ట్ స్టోరీస్2 సిరీస్ ఈ నెల 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లు ఎంత బోల్డ్ కంటెంట్ తో వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇటీవలే ప్రైమ్ వీడియోలో వచ్చిన ‘జీ కర్దా’ వెబ్ సిరీస్ లో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయిన తమన్నా ఇప్పుడు ‘లస్ట్ స్టోరీస్2’ లోనూ తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో అలాంటి సీన్లలో చెలరేగిపోయింది.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

ఇకపోతే జూన్ 29 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారం కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో తమన్నా, విజయ్‌‌ వర్మల ఘాటు రొమాన్స్ సీన్‌తో మొదలవుతుంది. వెంటనే పాజ్ అవుతుంది. ఆ తర్వాత వచ్చిన తమన్నా.. ‘‘ఈ లస్ట్ స్టోరీస్2 సిరీస్ చూస్తున్నపుడు ఎవరైనా గదిలోకి ప్రవేశిస్తే భయపడి ఫాజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో కేవలం రొమాన్స్ మాత్రమే కాదు.. డ్రామా, యాక్షన్‌ కలగలిసి.. అమ్మ ప్రేమ, అమ్మమ్మ ప్రేమతో పాటు మాజీ లవర్‌, పని మనిషిపై ప్రేమ, అన్న ప్రేమ.. ఇలా అన్నీ ఉంటాయి. అందుకే ఈ సిరీస్ పేరు చూసి మోసపోకుండా అందరికీ చూపించండి. అయినా ఇది చూస్తే.. తుఫాన్ ఏమైనా వస్తుందా? ఆకాశం విరిగి పడుతుందా? వైఫై షట్ డౌన్ అవుతుందా? అలాంటిదేం జరగదు కాబట్టి.. జూన్ 29న నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్ కాబోతోన్న ఈ సిరీస్ చూసి ఎంజాయ్ చేయండి’’ అని చెప్పుకొచ్చింది.