Tantra Trailer : భయానకంగా ‘తంత్ర’ ట్రైలర్ !


అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి ప్రధాన పాత్రలలో నటించిన ‘తంత్ర’ క్రియేటివ్ ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఇప్పటికే రిలీజైన్ టీజర్, సాంగ్స్‌ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై నరేష్ బాబు పి, రవి చైతన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 15న గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో ఈసినిమా ట్రైలర్ ను లాంచ్ చేసారు మేకర్స్.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

ట్రైలర్ చూస్తుంటే నిజంగా భయానకంగా అనిపిస్తుంది. ట్రైలర్ ప్రారంభంలో కేవలం అనన్యకు మాత్రమే జుట్టు విరబూసుకుని బాత్ రూమ్ లో ఓ పాప కనిపించడం, తర్వాత వచ్చే తాంత్రిక విధానాల సీక్వెన్స్ లు ఇంటెన్స్ హారర్ ఫిల్మ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చాయి. అనన్య, ధనుష్ మధ్య వున్న ప్రేమకథని కూడా చాలా నేచురల్ గా ప్రజెంట్ చేశారు. అనన్య, ధనుష్ పెర్ఫార్మెన్స్ బ్రిలియంట్ గా వుంది. సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి. మొత్తానికి ట్రైలర్ సినిమాపై చాలా క్యురియాసిటీని కలిగించింది.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం