ఓటీటీలో విజయ్ “వారసుడు”.. ఎప్పుడంటే !


తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా వారిసు. ఈ చిత్రం తెలుగులో వారసుడు పేరుతో డబ్ అయ్యింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ బ్యానర్‌లపై దిల్‌రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి నిర్మించిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. విజయ్, రష్మికా మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జ‌న‌వ‌రి 14న విడుదలై తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లే రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది.

Also Read :  Abhisun Jeevinth: డైరెక్టర్‌గా హిట్టు.. హీరోగా సక్సెస్ .. ఇప్పుడు 'డ్రామా కంపెనీ'తో హ్యాట్రిక్‌పై కన్నేసిన అభిషన్ జీవింత్!

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 22న ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అలాగే తెలుగుతోపాటు.. తమిళం, మలయాళంలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. ఇక్కడ మరో విషయం ఏమంటే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఓవర్సీస్ ప్రేక్షకుల కోసం సన్ నెక్ట్స్‌లో కూడా అందుబాటులోకి రానుంది.