గాండీవధారి అర్జున ట్రైలర్.. యాక్షన్ సీన్స్ తో అదరగొట్టిన వరుణ్ తేజ్


వైవిధ్య‌మైన జోన‌ర్స్ క‌థాంశాల‌తో సినిమాలు చేయ‌టానికి ఎప్పుడూ ముందుండే హీరోల్లో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ఒక‌రు. తాజాగా ఈయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన యాక్ష‌న్ అండ్ ఎమోష‌న‌ల్‌ థ్రిల్ల‌ర్ ‘గాండీవ‌ధారి అర్జున’. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించారు. స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు ఈ మూవీని తెర‌కెక్కించారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ మీద బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఆగ‌స్ట్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను నేడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేసారు.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

ఇక ట్రైలర్ అయితే భారీ యాక్షన్ సీన్స్, ఛేజింగ్స్ తో హాలీవుడ్ రేంజ్ లో ఆకట్టుకుంటోంది. కొన్ని వేల మంది చావులు వృధా కూడదు, ప్రపంచానికి నిజం తెలియాలి అంటూ అర్జున్(వరుణ్ తేజ్) చేసే పోరాట సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. హీరోతో పాటు సాక్షి కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొంటుంది. ఇక మిక్కీ జే మేయర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇక ఈ మూవీలో విమలా రామన్, వినయ్ రాయ్, రోషిణి ప్రకాశ్, మనీశ్ చౌదరీ, అభినవ్ గోమఠం, రవి వర్మ, కల్పలత, బేబి వేద కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం