KINGDOM : ‘కింగ్డమ్’ బ్లాక్‌బస్టర్ బుకింగ్స్ – 24 గంటల్లో 30K టికెట్లు!

Kingdom
KINGDOM : విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘కింగ్డమ్’ సినిమా జూలై 31న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా టికెట్ బుకింగ్స్ తెలుగు సినిమాల్లో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. బుకింగ్స్ ఓపెన్ చేసిన 24 గంటల్లోనే 30 వేల టికెట్లు సేల్ అవ్వడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. దీంతో ‘కింగ్డమ్’ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫాంలలో ట్రెండ్ అవుతోంది. ఈ క్రేజ్ చూసిన మేకర్స్, దేశ వ్యాప్తంగా భారీగా ప్రీమియర్ షోలు వేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 30న ప్రీమియర్స్ జరగనున్నాయి. ఓవర్సీస్‌లోనూ ప్రీ సేల్స్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..

ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించడంతో సినిమా మీద ఉన్న హైప్‌ మరింత పెరిగింది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ క్రియేట్ చేసింది. విజయ్ దేవరకొండకు బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయం అన్న నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా సినిమా విజయంపై పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల