
WAR 2 Trailer : బాలీవుడ్‌లో అత్యధిక ఆసక్తిని రేకెత్తించిన చిత్రాల్లో ‘వార్ 2’ స్పెషల్ ప్లేస్ దక్కించుకుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ను ప్రతిభావంతుడైన దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. తాజాగా మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచింది. యాక్షన్, డైలాగ్స్, విజువల్స్ అన్నీ హై స్టాండర్డ్‌లో ఉండటంతో ఈ సినిమా మీద హైప్ మరింతగా పెరిగింది.
ట్రైలర్‌లో ఎన్టీఆర్, హృతిక్ పాత్రలు ప్రేక్షకులను పూర్తి ఫోకస్ చేస్తాయి. “నేను మాటిస్తున్నాను… ఎవ్వరూ చేయలేని పనులను నేను చేసి చూపిస్తాను” అంటూ తారక్ చెప్పిన డైలాగ్ ఆయన మాస్ పర్సనాలిటీకి మరోసారి నిదర్శనం. ఇక “ప్రేమించిన వారిని కూడా చూడను… వెనకడుగు వేయను” అంటూ హృతిక్ చెప్పిన డైలాగ్ అతని పాత్రలోని డెడికేషన్‌ను చాటుతుంది. చివర్లో ఎన్టీఆర్ చెప్పిన “యుద్ధంలో ఆయుధాన్ని… చస్తా… లేదంటే చంపుతా” అనే డైలాగ్ సినిమా లోతును చెబుతోంది. హృతిక్, తారక్ ఇద్దరూ ఓటమిని లెక్కచేయని యోధులుగా అదరగొట్టేసారు. ట్రైలర్ మొత్తం చూస్తే, దేశభక్తి, రహస్య మిషన్లు, వ్యక్తిగత బాధలు, లోతైన ఎమోషన్లతో కథ సాగనుందని అర్థమవుతోంది. ఇక హృతిక్, తారక్ ఇద్దరూ వారి యాక్షన్ తో బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమనిపిస్తుంది.












