Toxic: ‘టాక్సిక్’ బిజినెస్‌తో యష్ హవా.. రూ.120 కోట్లకు తెలుగు రాష్ట్రాల రైట్స్?

Toxic Trailer

Toxic: రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా ‘టాక్సిక్’ బిజినెస్‌కు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా లాభాల్లో యష్‌కు పెద్ద మొత్తంలో వాటా రానున్నట్లు సమాచారం. అంతేకాకుండా కర్ణాటక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్‌ను తన సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ద్వారా యష్ స్వయంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో యష్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇక తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఏకంగా రూ.120 కోట్లకు ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల హక్కులను దిల్ రాజు దక్కించుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ డీల్ నిజమైతే టాలీవుడ్‌లో భారీ ధర పలికిన పాన్ ఇండియా సినిమాల జాబితాలో ‘టాక్సిక్’ చేరనుంది. మరోవైపు ఈ సినిమా డిజిటల్ రైట్స్ విషయంలోనూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి డిజిటల్ దిగ్గజాలు ఈ రేసు నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం జీ స్టూడియోస్‌తో డిజిటల్ హక్కుల కోసం చర్చలు జరుగుతున్నట్లు టాక్. అయితే ఈ బిజినెస్‌ వివరాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యష్ నటిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో బిజినెస్ డీల్స్ కూడా హాట్ టాపిక్‌గా మారాయి.