Site icon TeluguMirchi.com

Aamir Khan: 131 మంది కలిసి చేసిన రేర్ రింగ్.. అమీర్ ఖాన్ తన భార్యకు ఇచ్చిన గిఫ్ట్ చూశారా!

Aamir Khan

Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఇటీవలే గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకుని తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ముంబైలోని ఆయన నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి చాలా సింపుల్‌గా, రిజిస్టర్డ్ మ్యారేజ్ పద్ధతిలో జరిగింది. అయితే ఈ వివాహం ఎంత సింపుల్‌గా జరిగిందో, అమీర్ ఖాన్ తన భార్యకు గిఫ్ట్‌గా ఇచ్చిన వెడ్డింగ్ రింగ్ మాత్రం అంత అరుదైనదిగా నిలిచి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

సాధారణంగా సెలబ్రిటీల పెళ్లిళ్లలో భారీ డైమండ్ రింగ్స్ కనిపించడం ఆనవాయితీ. కానీ అమీర్ ఖాన్ మాత్రం దానికి భిన్నంగా అత్యంత అరుదైన ఒక ‘మడగాస్కర్ రూబీ’ (కెంపు) ఉంగరాన్ని గౌరీ స్ప్రాట్‌కు కానుకగా ఇచ్చారు. క్వీన్ అనే లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్ ఈ అద్భుతమైన మాస్టర్‌పీస్‌ను డిజైన్ చేసిందట. ఈ ఉంగరం మధ్యలో ఉండే అరుదైన కెంపును సేకరించడానికే మేకర్స్‌కు దాదాపు మూడు నెలల సమయం పట్టిందట. ప్రపంచంలోని కెంపుల్లో కేవలం 0.1 శాతం మాత్రమే ఈ స్థాయి నాణ్యతను కలిగి ఉంటాయని, ఇది మిలియన్‌లో ఒకటి మాత్రమే దొరికే అరుదైన రత్నమని సమాచారం.

రత్నాన్ని సేకరించిన తర్వాత ఈ ఉంగరానికి రాజసం ఉట్టిపడేలా తీర్చిదిద్దేందుకు చిత్రకారులు ఎంతో శ్రమించారట. కిరీటం ఆకారంలో ఉన్న బంగారు బేస్‌పై 40 సహజసిద్ధమైన వజ్రాలను పొదిగి, దాని మధ్యలో ఈ రూబీని అమర్చారని చెబుతున్నారు. ఈ రాయల్ రింగ్‌ను తయారు చేయడానికి 131 మంది నిపుణులైన హస్తకళాకారులు పనిచేశారు. డిజైన్ డెవలప్‌మెంట్ నుంచి స్టోన్ సెట్టింగ్, ఫినిషింగ్ వరకు మొత్తం 256 గంటల పాటు శ్రమించి ఈ అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించారని తెలుస్తోంది. ఆడంబరాలకు దూరంగా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నప్పటికీ, భార్యపై తనకున్న ప్రేమను చాటడానికి అమీర్ ఖాన్ ఎంచుకున్న ఈ ప్రత్యేకమైన గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక్కోసారి మనం చూపే చిన్న చిన్న ప్రత్యేకతలే జీవితాంతం గుర్తుండిపోయే గొప్ప ప్రేమకథలను చెబుతాయని నెట్టిజన్లు న్యూస్‌పై కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version