90’s Hero: గ్రే జుట్టు, స్టైలిష్ గ్లాసెస్, ట్రెండీ అవుట్‌ఫిట్.. ఫోటోను చూసిన వెంటనే ఒక్కసారి షాక్ కు గురి కావాల్సిందే..! “ఇతనేనా..?” అనే ప్రశ్న మీ మనసులో తలెత్తకమానదు. ఎందుకంటే, ఇది యంగ్ క్రష్‌గా 1990లలో తెలుగు, తమిళ చిత్రసీమను కుదిపేసిన హీరో అబ్బాస్ అలీ తాజా లుక్.
ఆ కాలంలో ‘ప్రేమదేశం’, ‘వీఐపీ’, ‘పూవెలి’ వంటి సినిమాలతో సూపర్ హిట్ హీరోగా వెలిగిన అబ్బాస్, అప్పట్లో ఎంతోమంది యువతీ హృదయాలను దోచుకున్నాడు. కానీ, 2015లో వచ్చిన మలయాళ చిత్రం ‘పచ్చక్కాళం’ తర్వాత అతను వెండితెర నుంచి దాదాపుగా కనుమరుగయ్యాడు.
ఈ మార్పుతో పాటు అబ్బాస్ మళ్లీ బిగ్ స్క్రీన్ మీద కనిపించాలని, ప్రముఖ హీరోలతో మళ్లీ నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. నటనపై అభిరుచి ఉన్న నటుడు అయిన అబ్బాస్, ఇప్పుడు ఈ మోడర్న్ లుక్‌తో మరింత స్టైలిష్‌గా మారడం, మళ్లీ అతడి సినీ ప్రయాణానికి ఊపునివ్వొచ్చు. ఇక చూడాలి మరి… ఈ సైలెంట్ కమ్‌బ్యాక్ ఎప్పుడు గ్రాండ్ అవుతుంది..? ఇంతకీ, మీరు ఫోటోలోని వ్యక్తిని మొదట్లో గుర్తుపట్టగలిగారా..?

