Site icon TeluguMirchi.com

Actress Pragathi : 50 ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్.. పవర్ లిఫ్టింగ్‌లో అదరగొట్టిన నటి ప్రగతి

Pragathi
Actress Pragathi : టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి ఇప్పుడు కేవలం నటిగా మాత్రమే కాకుండా క్రీడాకారిణిగా కూడా తన ప్రతిభను చాటుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకప్పుడు కథానాయికగా, తరువాత తల్లి పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రగతి, ఇప్పుడు పవర్ లిఫ్టింగ్ లోనూ తన సత్తా చూపుతున్నారు. 2024లో జరిగిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించిన ఆమె, తాజాగా 2025లో కేరళలో జరిగిన నేషనల్ మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్‌తో పాటు మరో రెండు విభాగాల్లో మెడల్స్ గెలుచుకొని తన ప్రతిభను నిరూపించారు. స్క్వాట్ 115 కిలోలు, బెంచ్ ప్రెస్ 50 కిలోలు, డెడ్ లిఫ్ట్ 122.5 కిలోల పోటీల్లో పాల్గొన్న ఆమె, మూడు విభాగాల్లోనూ మెడల్స్ గెలుచుకున్నారు.

తన విజయానికి కారకులైన కోచ్‌లకు సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ప్రగతి. “అభిరుచి, క్రమశిక్షణ, కృషి, విరిగిన హృదయం మాత్రమే దీనికి అవసరం,” అంటూ భావోద్వేగంగా పోస్ట్ చేశారు. 50 ఏళ్ల వయసులో ఈ స్థాయి ఫిట్‌నెస్ సాధించడం ద్వారా ఆమె ఎంతోమందికి ప్రేరణగా మారారు. సినిమాలలో తరచూ కనిపించకపోయినా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రగతి, వర్కౌట్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి తన శరీర ధారుడ్యాన్ని నిరూపిస్తున్నారు. ప్రస్తుతం ఆమెపై అభిమానులు, సహచర నటులు ప్రశంసల వర్షం కురిపిస్తూ, “హ్యాట్సాఫ్!”, “ట్రూ ఇన్‌స్పిరేషన్!” అంటూ అభినందనలు తెలుపుతున్నారు.

Exit mobile version