Site icon TeluguMirchi.com

Raaka: సెప్టెంబర్ 21న బన్నీ – అట్లీ ‘రాకా’ ఫస్ట్ గ్లింప్స్.. వైరల్ అవుతున్న లీక్!

Raaka

Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్-ఇండియా చిత్రం ‘రాకా’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ తేదీ ఖరారైంది. ఈ నెల 21న దర్శకుడు అట్లీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇటీవల జరిగిన ‘సిగ్మా’ ఈవెంట్‌లో పాల్గొన్న డైరెక్టర్ సిబి ఈ విషయాన్ని వెల్లడించారు. తాను ఇప్పటికే ‘రాకా’ మూవీ విజువల్స్ చూశానని, అవి సూపర్‌గా వచ్చాయని పేర్కొన్నారు. ఆ భారీ విజువల్ ప్రపంచాన్ని ప్రేక్షకులు మరో మూడు రోజుల్లో చూడబోతున్నారంటూ క్లారిటీ ఇచ్చారు.

భారతీయ చిత్ర పరిశ్రమలోనే సరికొత్త గేమ్ ఛేంజర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల వరుస అప్‌డేట్లతో సందడి చేస్తున్న చిత్ర బృందం, సెప్టెంబర్ 21న గ్లింప్స్ రిలీజ్ చేయనున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.

Exit mobile version