
Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్-ఇండియా చిత్రం ‘రాకా’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ తేదీ ఖరారైంది. ఈ నెల 21న దర్శకుడు అట్లీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇటీవల జరిగిన ‘సిగ్మా’ ఈవెంట్లో పాల్గొన్న డైరెక్టర్ సిబి ఈ విషయాన్ని వెల్లడించారు. తాను ఇప్పటికే ‘రాకా’ మూవీ విజువల్స్ చూశానని, అవి సూపర్‌గా వచ్చాయని పేర్కొన్నారు. ఆ భారీ విజువల్ ప్రపంచాన్ని ప్రేక్షకులు మరో మూడు రోజుల్లో చూడబోతున్నారంటూ క్లారిటీ ఇచ్చారు.
భారతీయ చిత్ర పరిశ్రమలోనే సరికొత్త గేమ్ ఛేంజర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల వరుస అప్డేట్లతో సందడి చేస్తున్న చిత్ర బృందం, సెప్టెంబర్ 21న గ్లింప్స్ రిలీజ్ చేయనున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.














