
Dada: నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దాదా’ స్టోరీపై సినీ వర్గాల్లో అత్యంత ఆసక్తికరమైన లీక్ బయటకు వచ్చింది. ఇప్పటివరకు వచ్చిన ప్రచార చిత్రాలను బట్టి ఇది 1980ల బ్యాక్‌డ్రాప్‌లో సాగే రక్తసిక్తమైన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా మాత్రమే అని అందరూ భావించారు. అయితే, తెరవెనుక అసలు ట్విస్ట్ మరొకటి ఉందని తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ చిత్రం కేవలం తుపాకుల మోతలు, రక్తపాతంతో కూడిన మాస్ మసాలా గ్యాంగ్‌స్టర్ సినిమా మాత్రమే కాదని.. గుండెల్ని పిండేసే బలమైన కుటుంబ భావోద్వేగాలు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. బాలకృష్ణ మార్క్ మాస్ యాక్షన్‌కు తోడుగా, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేసే సెంటిమెంట్, రిలేషన్స్ డ్రామా ఈ కథలో అత్యంత బలంగా కుదిరినట్లు తెలుస్తోంది. ఈ సెంటిమెంట్ యాంగిలే బాక్సాఫీస్ వద్ద సినిమాకు సరికొత్త ప్లస్ పాయింట్ కానుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తుంది.
వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, మంచు మనోజ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం శరవేగంగా ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్ర షూటింగ్లో బాలయ్య త్వరలోనే మళ్లీ జాయిన్ కానున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం.. మాస్ ప్రియులతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.













