Site icon TeluguMirchi.com

Allu Arjun : ‘లిటిల్ హార్ట్స్’ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నవ్వించింది : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Littlehearts
Allu Arjun : మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా ప్రేక్షకులను అలరిస్తూ విజయవంతంగా థియేటర్లలో కొనసాగుతోంది. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. “లిటిల్ హార్ట్స్ సినిమా చూశాను. ఎలాంటి మెలొడ్రామా, సందేశాలు లేకుండా బాగా నవ్వించింది. ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఉన్న ఫ్రెష్ లవ్ స్టోరీతో ఆకట్టుకుంది. మౌళి, శివానీ తమ పర్ ఫార్మెన్స్ తో మెప్పించారు. ఇతర నటీనటులంతా బాగా నటించారు. సాయి మార్తాండ్ దర్శకత్వ ప్రతిభ నాకెంతో నచ్చింది. సింజిత్ మ్యూజిక్ రిఫ్రెషింగ్ గా అనిపించింది. లిటిల్ హార్ట్స్ లాంటి స్పెషల్ ఫిల్మ్ ను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్ కు నా అభినందనలు” అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై సాయి మార్తాండ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. బన్నీ వాస్ తన బీవీ వర్క్స్ బ్యానర్ ద్వారా, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేశారు. పాజిటివ్ టాక్‌తో ముందుకు సాగుతున్న ‘లిటిల్ హార్ట్స్’ సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు లభించడం టీంకు మరింత బలాన్నిస్తోంది.

Exit mobile version