Chiru Birthday : టాలీవుడ్ మెగాస్టార్, పద్మ విభూషణ్ చిరంజీవి నేడు 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి సినీ ప్రయాణం, సామాజిక సేవలను గుర్తుచేసుకుంటూ ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన మేనమామ చిరంజీవికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘‘హ్యాపీ బర్త్‌డే.. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు’’ అంటూ ట్వీట్ చేసిన బన్నీ, ఆయనతో కలిసి డ్యాన్స్ చేసిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Sitara Ghattamaneni : నేను కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లోనే.. సితార క్లారిటీ
అయితే, అల్లు అర్జున్ చేసిన ఈ విషెస్ ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ఎందుకంటే ఆయన చిరంజీవిని “వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్” అని సంబోధించడం ప్రత్యేకంగా నిలిచింది. గత కొంతకాలంగా మెగా, అల్లు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు గట్టిగా వినిపిస్తున్న తరుణంలో బన్నీ చేసిన ఈ ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. 2024 ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం, ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు, ‘పుష్ప 2’ తొక్కిసలాట ఘటనలో వచ్చిన విమర్శలు, అలాగే చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఫ్లెక్సీలో బన్నీ ఫోటో లేకపోవడం వంటి సంఘటనలు ఇరు కుటుంబాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినట్లు చూపించాయి. ఈ నేపథ్యంలో బన్నీ చేసిన పుట్టినరోజు ట్వీట్ ప్రస్తుతం మెగా, అల్లు అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది.
Murali Naik Biopic : వీర జవాన్ మురళి నాయక్ బయోపిక్ పాన్ ఇండియా స్థాయిలో

